రాత్రి వేళల్లో 4 గంటలు లేదా అంత కంటే తక్కువ నిద్రపోయే స్త్రీ, పురుషుల్లో అధికంగా గుండెపోటులు సంభవించే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రమాదం ముఖ్యంగా మధ్య వయస్కులు, లేదా వయసు మీరిన వారిలో అధికంగా ఉంటుందని నిర్ధారించారు.

గుండెపోటు కలిగేందుకు మిగతా కారణాలతో పాటు, నిద్రలేమి కూడా ఓ ప్రధాన కారణంగా నిలుస్తుందని వైద్యులు తెలిపారు. అదే సమయంలో అధికంగా నిద్ర పోవడం కూడా ప్రమాదకరం అని వైద్య నిపుణులు తెలిపారు. ప్రతి రోజూ ఆరోగ్యకరమైన వ్యక్తికి రాత్రివేళల్లో 7 గంటల నిద్ర అవసరం అని వైద్యులు తెలుపుతున్నారు. ఇంతకంటే తక్కువ నిద్ర కలిగిఉంటే మునుముందు గుండెపోటు కలిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రి వేళల్లో 7 గంటల నిద్ర గుండె కు ఆరోగ్యకరమైన పరిస్థితులను కల్పిస్తుందని వైద్యులు తెలిపారు.

అంతే కాకుండా ఆరోగ్యకరమైన నిద్ర కళ్ళకు, మెదడుకు తగిన విశ్రాంతి ఇచ్చేందుకు ప్రధానం అని, నిద్రలేమి కారణంగా గుండెపోటు తో పాటు, చక్కెర వ్యాధి మరియు కొన్ని విధాల క్యాన్సర్ కు కూడా దారితీస్తుందని వైద్యులు తెలిపారు. ప్రధానంగా 6 గంటలకంటే తక్కువ నిద్రించే వారి శరీరంలో సి-రియాక్టివ్ ప్రోటీనులు 25 శాతం అధికంగా ఉత్పత్తి అవుతాయని, ఇవి గుండె పనితీరుపై ప్ర

భావం చూపుతాయని ప్రాధమికంగా వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రోటీను శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి పరిణామాన్ని నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం స్త్రీ, పురుషులు ఇద్దరిలో ఉంటుందని వైద్యులు తెలిపారు.

ఈ సి-రియాక్టివ్ ప్రోటీన్ శరీరంలో ధమనులపై ప్రభావం చూపుతుందని, తద్వారా గుండె పోటు సంభవించవచ్చని అభిప్రాయం. దీని కారణంగా ధమనుల్లో కాలక్రమేణా రక్తం గడ్డకట్టే పరిణామాలు చోటుచేసుకుంటాయని ఇది చాలా ప్రమాదకరం అని వైద్యులు తెలిపారు.

ఈ కారణాలకు తోడు రాత్రివేళల్లో నిద్రలేమి, పైనుండి మద్యం సేవించడం మూలంగా దీని ప్రభావం శరీర వ్యవస్థపై తీవ్రంగా కనబరిచి ప్రాణాంతకం అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎన్నికారణాలు ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా, ఏ విధమైన టెన్షన్ పరిస్థితులు ఉన్నా సమయానికి నిద్రపోయడం, తగినంత సమయం నిద్ర పోవడం అవసరం అని వైద్య శాస్త్రం సూచిస్తుంది.

మంచి నిద్ర మెదడుకు పట్టిన విషాన్ని శుభ్రం చేస్తుంది

రాత్రి వేళ సరైన సమయంలో తగిన మోతాదులో నిద్ర పోతే అది మెదడుకు పట్టిన విషాన్ని శుభ్రం చేస్తుందని విశ్లేషకులు జరిపిన ఓ ప్రయోగం ద్వారా నిర్ధారించారు.

శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన ప్రయోగాల ఫలితంగా ఈ ఫలితాలను నిర్ధారించారు. ఉదయం అంతా వృత్తి పరంగా, మరే విధమైన ఒత్తిడి మూలంగా మెదడుకు పట్టిన విషకణాలను రాత్రి వేళ గాఢ నిద్ర దూరం చేస్తుందని నిర్ధారించారు. రాత్రివేళలో తగిన నిద్ర మూలంగా మెదడులో ఉన్న టాక్సిక్ న్యూరో డిజనేరేటివ్ మొలెక్యుల్స్ ను పెంచటంలో, వృద్ది చేస్తుందని నిర్ధారించారు.

న్యూయార్క్ కు చెందిన జాతీయ న్యూరాలజీ డిసార్డర్స్ అండ్ స్ట్రోక్ సంస్థ నిపుణులు ఈ పరీక్షలను చేపట్టారు. ‘నిద్ర మెడకు కణాల తీరు, పరిణామాలను మారుస్తుంది. నిద్ర సమయంలో మెదడు పూర్తిగా విశ్రాంతి పొంది అవసరమైన శక్తిని సంపాదించుకుంటుంది అని మేము నిర్ధారణకు వచ్చాము’ అని నిపుణులు మైకెన్ నాదర్ గార్డ్ తెలిపారు.

తమ పరిశీలన ఫలితాలను పూర్తిగా త్వరలో ప్రచురించనున్నట్లు ఆయన తెలిపారు.


రాత్రివేళల్లో తక్కువ నిద్ర పోవడం, ఎక్కువగా ఆలోచించడం మూలంగా ఈ పరిణామాలు ఆరోగ్యం పై తీవ్రంగా పడగలవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మెదడులో కణాల మార్పులు శరీరంలో అనేక అవయవయాలపై చూపగలవని, మెదడు కణాల దెబ్బతినడం వల్ల అంగాలు పనిచేయడం మానివేసి ఒక్కో సందర్భంలో మరణం సంభవించవచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు.
Live Beauty Pedia© 2014. All Rights Reserved. Template By Seocips.com
SEOCIPS Areasatu Adasenze Tempate Tipeex.com