ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కుంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. దిన్ని అధిగమించాలంటే జుట్టుకు సరైన పోషణ అందించాలి. వారంలో కనీసం రెండుసార్లైన నూనె పెట్టి మర్దన చేసి ఒక గంట తరువాత మనకు న్యాచురల్ గా దొరికే కుంకుడుకాయ రసం తో తల స్నానం చేయడం వల్ల కొంతైనా హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడొచ్చు. జుట్టు రాలకుండా కాపాడటంలో మందారం కీలకపాత్ర పోషిస్తుంది...

మందారంతో కొన్ని చిట్కాలు :

మందారపు పువ్వుని కాగేనూనేలో వేసి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించుకుని అరగంట తరవాత తలారా స్నానం చేస్తే జుట్టు నిగ నిగ లాడుతూ వత్తుగా పెరుగుతుంది.

పోడిబారినట్టు జీవం లేకుండా తయారైన జుట్టుకోసం :  ఆరు మందారపువ్వుల్ని గుజ్జుగా చేసి అందులో ఒక స్పూను కలబంద గుజ్జు కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

 ఎక్కువగా ప్రయాణాలు చేసేవారి జుట్టుకోసం : ఒక గ్లాసు నీళ్లలో రెండు టీ స్పూన్ల టీ పొడి వేసి మరిగించి అందులో ఒక టేబుల్ స్పూను మందారపొడి వేసి కలిపి తలకు పట్టించాలి. జుట్టుకి ఇది మంచి కండీషనర్‌గా ఉపయోగపడుతుంది.

వెంట్రుకలు చిట్లిపోకుండా : వెంట్రుకలు చిట్లిపోకుండా ఉండాలంటే ఒక కప్పు పుల్లటి పెరుగులో రెండు టీ స్పూన్ల మందారపొడి వేసి బాగా కలిపి జట్టుకి పట్టించాలి

జుట్టు ఎదుగుదలకు పోషకపదార్ధాలు,ప్రోటిన్స్ అవసరం కాబట్టి బలమైన పోషక పదార్ధాలైన పాలు,పళ్ళరసాలు రోజు తీసుకునే ఆహారంలో ఉదెల చూసుకోవాలి.

జుట్టురాలిపోవడానికి కారణం అనారోగ్య సమస్యలు కూడా కావచ్చు. మనం పై మెరుగులు ఎన్ని చేసినా జుట్టు లోపలి నుంచి ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైన ఆందోళనలకు గురికాకుండామనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకుంటూ ఈ చిన్న చిట్కాలను పాటిస్తూ ఆరోగ్యమైన జుట్టును మీ సొంతం చేసుకోండి...


Live Beauty Pedia© 2014. All Rights Reserved. Template By Seocips.com
SEOCIPS Areasatu Adasenze Tempate Tipeex.com